దాసరి అంత్యక్రియలు పూర్తి
దర్శకనిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్ మండలం తోల్కట్ట వ్వవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. దాసరి సతీమణి పద్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియల్ని పూర్తి చేశారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు తండ్రి చితికి నిప్పుపెట్టారు. దాసరిని కడసారి చూసేందుకు సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాము ఎంతగానో అభిమానించే దాసరికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా తుదివీడ్కోలు పలికారు.








