మూడున్నర కోట్ల పాత నోట్లు మారుస్తున్న 9 మంది అరెస్ట్
రద్దైన పాత నోట్ల మార్పిడికి యత్నించిన 9మందిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కోట్ల 50 లక్షల రూపాయల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.నగరంలో నివశిస్తున్న భీమవరానికి చెందిన విజయ్, అతని స్నేహితులు, బంధువులు నుంచి పాత కరెన్సీని మార్పిడి చేస్తామంటూ సేకరించారు. ఎస్సార్ నగరలోని ఓ పార్క్ సమీపంలో మార్పిడి యత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.








