కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రం నుంచి ఈయన రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులుమనాలికి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో కారు సీటులోనే కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచారు.








