బీఆర్ఎస్కు గతమే.. భవిష్యత్తు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది, భవిష్యత్తు లేదు, ఉద్యమ సమయంలో ఎలా మాట్లాడినా ప్రజలు సహించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కవిత (Kavitha) కొత్త పార్టీ ఏర్పాటుపైనా స్పందించారు. కేసీఆర్ (KCR) కుటుంబమంతా ఒక్కటే అని విమర్శించారు. వాళ్లు తెచ్చిపెట్టుకున్న నటనను ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పార్టీకి మనుగడ లేదని, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ కు ప్రజలతో సంబంధాలు లేవన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదని, ఆయన విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఆయన చావును తానెందుకు కోరుకుంటానని అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కేసీఆర్కు గాయమైనప్పుడు ఆస్పత్రి (Hospital)కి వెళ్లి పరామర్శించానని, అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగానని రేవంత్ చేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం ఉందన్నారు. కేసీఆర్కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని, ఆయన బతికి ఉంటే తమకు అధికారం రాదని కుటుంబ సభ్యులే భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి కావాలని మంత్రులతో ప్రకటనలు చేయించారని ఆరోపించారు. ఆయన మర మనిషో కాదో కుటుంబ సభ్యులకే తెలుసునన్నారు. అధికార పంపకాల విషయంలో తేడాలు రావడంతో కుటుంబంలో విభేదాలు వచ్చాయన్నారు. అయితే, వాళ్లంతా ఒక్కటేనని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందని, నివేదిక ఆధారంగా చర్యలు వద్దని కోర్టు చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ తర్వాతే చర్యలు ఉంటాయన్నారు. తాము వివక్ష లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, అన్ని వర్గాల ప్రజలకూ సమన్యాయం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








