కేకేను పరామర్శించిన సీఎం కేసీఆర్
అనారోగ్యంతో బాధపడుతూ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావును ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. కేకే మూత్ర సంబంధిత సమస్య, జ్వరంతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నిమ్స్‌కు వచ్చిన కేసీఆర్, కేకేను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను, నిమ్స్ సంచాలకులు డాక్టర్ మనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వెంట ఉపముఖ్యమంత్రి మహమూద్ ఆలీ తదితరులు ఉన్నారు.








