రికార్డుల ప్రక్షాళన తేదీలు ఖరారు
భూముల సర్వే రికార్డుల ప్రక్షాళన తేదీలను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రైతు సంఘాలు ఏర్పాటు, రైతు సదస్సుల నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు గ్రామ రైతు సంఘాల సమన్వయ సమితుల ఏర్పాటు, సప్టెంబర్ 10 నుంచి 15 వరకు మండలస్థాయిలో రైతు సమన్వయ సమితులు, సదస్సుల నిర్వహణ, సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భూ రికార్డుల ప్రక్షాళన జరగనుంది. మొత్తం 3600 బృందాలతో రికార్డుల ప్రక్షాళన చేస్తారు.








