జీ-శాట్ ప్రయోగం విజయంపై సీఎం కేసీఆర్ హర్షం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీశాట్-9 ప్రయోగం విజయవంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని ఆకాక్షించారు. షార్ కేంద్రం నుంచి ఆసియా శాటిలైట్ విజయవంతంగా నింగిలోకి ఎగిరింది. శుక్రవారం సాయంత్రం 4:57 నిమిషాలు జీఎస్ఎల్వీ ఎఫ్09 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది.








