సినీ, రాజకీయ రంగాల్లో దాసరి ముద్ర – కేసీఆర్
సినీ, రాజకీయ రంగాల్లో దర్శకరత్న దాసరి తనదైన ముద్ర వేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దాసరి మృతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సినీ రంగంలో ఎంతో మందిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కారణమైన ఆదర్శప్రాయుడు దాసరి అని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడంలో దాసరి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.








