21న ఉపరాష్ట్రపతికి పౌర సన్మానం
భారత ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తెలుగుబిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడును రాష్ట్ర ప్రభుత్వం తరపున పౌర సన్మానం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. అందుకోసం ఈనెల 21న తేదీని ఖారారు చేశారు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున రాజ్భవన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదేరోజు పక్కనే ఉన్న దిల్కుష్ ప్రభుత్వ అతిథి గృహం ప్రాంగణంలో మర్యాద పూర్వక విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, ఆర్థిక, వ్యాపార ప్రముఖులను ఆహ్వానించనున్నారు.








