నవంబరు 8 నుంచి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు
అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు హైదరాబాద్లో నవంబరు 8 నుంచి 14 వరకు జరుగుతాయని పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. శిల్పాకళావేదికలో ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సినిమా అభివృద్ధి సంస్థ, బాలల సినిమా సొసైటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో 12 థియేటర్లను ముందుగానే బుక్ చేయాలని, ఈ మేరకు అధకారులు తనిఖీలు చేయాలని సూచించారు. తెలంగాణలోని 31 జిల్లాలో బాలల చలన చిత్ర పండగను నిర్వహించాలని, జవహర్ బాల భవన్లో సదస్సులు జరుగుతాయని తెలిపారు.








