తెలంగాణ మహానాడుకు హాజరుకానున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ మహానాడుకు కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాల్లో బిజీబిజీగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్లో జరగనున్న మినీ మహానాడుకు వస్తారా లేదా అనే సందేహం తొలుత అందరికీ వచ్చింది. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు చంద్రబాబును కలిసి తప్పకుండా రావాల్సిందేనని కోరారు. దీంతో ఆయన మినీ మహానాడు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాగా ఇప్పటికే మహానాడుకు సంబంధించి ఏర్పాట్లన్నీ భారీగా జరుగుతున్నాయి. మహానాడు కార్యక్రమంలో మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నట్లు తెలిసింది.













