గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటలో ఉన్న ముఖ్యమంత్రి ఈ మేరకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమై పలు అంశాలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతోన్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించడంతో పాటు తాజా పరిణామాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ అంశాలపై చొరవ చూపాలని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. విభజన చట్టంలోని ఏపీకి దక్కాల్సిన 9, 10 షెడ్యూల్లోని పలు అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలనూ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.








