సినారెకు తెలంగాణ మంత్రుల నివాళి
జ్ఞానపీఠ్ అవార్డ గ్రహీత సి.నారాయణరెడ్డి మృతి తెలుగు జాతికి తీరని లోటని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సినారె స్వగృహంలో ఆయన భౌతికకాయానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సినారె అంత్యక్రియలు అధికార లాంచనలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. ఆ బాధ్యతలను తనతోపాటు సహచర మంత్రి జగదీశ్‌రెడ్డికి అప్పగించారని తెలిపారు.








