ఈ నెల 18న బ్రహ్మణ మహిళా సదస్సు
బ్రాహ్మణ మహిళా సదస్సును ఈ నెల 18న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్వహించనున్నది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదస్సులో ప్రభుత్వ విప్ కే లక్ష్మీ, మహిళా ఎమ్మెల్మేలు గొంగిడి సునీత, ఆజ్మీరా రేఖ, బొడిగ శోభ, కొండా సురేఖతోపాటు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణచారి, వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు, డాక్టర్ సులోచేన సువర్ణ, సుమలత వర్మ, సముద్రాల వేణుగోపాలచార్య తదితరులు పాల్గొనున్నారు.








