జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళిక – బొంతు రామ్మోహన్
హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలతో కృషి చేస్తుందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ. 15 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన బ్రాంచ్ ప్రునింగ్ మిషన్, రూ.2.5లక్షలతో కొనుగోలు చేసిన ష్రెడ్డింగ్ మిషన్లను ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌తో కలిసి ఇందిరాపార్కు వద్ద ఆయన ప్రారంభించి మాట్లాడారు.








