నేటి నుంచి బతుకమ్మ సంబురాలు
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్య పండుగ 28న సద్దులతో ముగుస్తుది. ఈ పండుగను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం మొత్తం తొమ్మిది రోజుల పాటు గతంలో కంటే భారీగా ఉత్సవాలు జరిపేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో పాటు ఈసారి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని తెలంగాణ మహిళలు, ప్రజలు పండుగ చేసుకునేందుకు సన్నాహాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, యాస, భాషలను ప్రతిబింబిస్తూ ప్రతి ఇంటా పండుగ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలకు తెలంగాణ జాగృతి సహకరించనుంది. వూరురా ఉత్సవాలు జరగనుండగా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో, చార్మినార్, భువనగిరి గుట్ట వంటి చారిత్రక ప్రదేశాల్లో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.








