ప్రగతి భవన్ లో బతుకమ్మ వేడుకలు
ప్రగతి భవన్లో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలని అలంకరించి, బతుకమ్మ పాటలకు అనుగుణంగా బొడ్డెమ్మలు ఆడారు. ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, హరీష్రావు సతీమణి శ్రీనిత, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో పాటు పలువురు మహిళలు, ప్రగతి భవన్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు.








