వరంగల్ వచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వరంగల్ నగరానికి చేరుకున్నారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో జరుగుతున్న ములుగు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క కుమారుడి వివాహానికి ఆయన హాజరయ్యారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్ వద్ద దిగిన ఆయన అక్కడ నుంచి వాహన శ్రేణిలో విష్ణుప్రియ గార్డెన్‌కు చేరుకున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట రేవంత్ రెడ్డి, ఎల్.రమణ సహా పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వరంగల్ అర్బన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.













