సీఎం కేసీఆర్‌కు ఉదయభాను ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బుల్లితెర వ్యాఖ్యాత, నటి ఉదయభాను మర్యాదపూర్వకంగా కలిశారు. భర్తతో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన ఆమె, తమ పిల్లల పుట్టినరోజు వేడుకకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఉదయభాను దంపతుల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో హోటల్లో సెప్టెంబర్ 3న పిల్లల పుట్టిన రోజు వేడుక జరగనుంది. ముఖ్యమంత్రి భేటీ అనంతరం తన ఫేస్బుక్లో ఫొటోలు ఫోస్ట్ చేసిన ఉదయభాను కేసీఆర్ దేశంలోనే డైనమిక్ లీడర్. మా పిల్లలకు ఆయన ఆశీర్వాదాలు వెలకట్టలేనివి అని కామెంట్ పెట్టారు. ప్రేమ వివాహం చేసుకున్న ఉదయభాను గత ఏడాది కవలపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.








