తెలంగాణలో అమిత్షా పర్యటన
తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పర్యటన ఖరారైంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో అమిత్షా రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. 22వ తేదీన నల్గొండ జిల్లా మునుగోడులో, 23న నాగార్జునసాగర్, మిర్యాలగూడలో, 24న నకిరేకల్, భువనగిరి, హైదరాబాద్లో పర్యటిస్తారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా జిల్లాల అధ్యక్షుడు, ఆఫీస్ బేరర్లతో సమావేశం అవుతారని తెలిపారు. అమిత్ షా పర్యటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని లక్ష్మణ్ అన్నారు. పేద ముస్లింల మద్దతుగా హైదరబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని సృష్టం చేశారు. ఈ నెల 29 నుంచి జూన్ 15 వరకు తెలంగాణలో విస్తార యోజన పేరిట పల్లెపల్లెకు బీజేపీ, ఇంటింటికి మోడీ బాట పట్టనున్నామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి మోడీ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.








