అక్టోబర్ 1న అలయ్ బలయ్
ప్రతి యేటా మాదిరిగానే కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ ఈ ఏడాది కూడా దసరాపండుగ నవరాత్రులను పురస్కరించుకుని అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. గడచిన 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రులతో పాటు బతుకమ్మ పండుగా కూడా కలిసి రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు.








