మంత్రి హరీశ్‌రావుకు ఏఎఫ్ఎంఐ ఆహ్వానం
అమెరికాలోని షికాగోలో అక్టోబరు 7న భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు- లౌకికవాదం, బహుళత్వం అన్న అంశంపై జరగనున్న సదస్సులో మాట్లాడాలని భారతీయ సంతతి అమెరికన్ ముస్లిం సమాఖ్య (ఏఎఫ్ఎంఐ) తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును ఆహ్వానించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టును ఏఎఫ్ఎంఐ ప్రతినిధులు రజియా అహ్మద్, కుత్బుద్దీన్, ఏఎస్ నకాదర్ అభినందించారు. ఈ ప్రాజెక్టు కింద 17 వేల చెరువులను పునరుద్ధరించి 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించండం అభినందనీయమన్నారు.








