మిసెస్ యూనివర్స్ పోటీలకు ఎంపికైన అభిమానిక
మిసెస్ యూనివర్స్ 2017 తుది పోటీలకు ఎంపికైనట్లు హైదరాబాద్కు చెందిన నృత్యకారిణి అభిమానిక యాదవ్ తెలిపారు. సెప్టెంబరు 2న దక్షిణాఫ్రికాలో జరిగే ఈ పోటీల కోసం ఆమె ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ప్రయాణం మొదలు పెట్టి యోగా, పాశ్చాత్య, జుంజా ఇతర నృత్యశైలలు శిక్షకురాలిగా కొనసాగుతూ వందల మంది అందమైన గృహిణలకు గట్టి పోటీనిచ్చి 2016లో మిసెస్ ఇండియా, మిసెన్ ఏషియా పసిఫిక్ పోటీలోనూ విజేతగా నిలిచారు. ఇప్పుడు దక్షిణ భారత దేశం నుంచి మిసెస్ యూనివర్స్ 2017గా పోటీపడుతున్నారు. అభిమానిక తల్లి వత్సలేంద్రకుమారి హైకోర్టు న్యాయవాది, పేరిణి నృత్య కళాకారిణి. దక్షిణ భారతదేశం నుంచి ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడం ఎంతో గర్వంగా ఉందని అభిమానిక తెలిపారు.








