Ys Jagan: ఎవరికీ లేని రూల్ మనకే ఎందుకు..?
తాడేపల్లి వైసీపీ(YCP) కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం వైఎస్ జగన్(Ys Jagan).. సిఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు(Chandrababu Naidu) డ్రామా కంపెనీ అంటూ ఎద్దేవా చేసిన జగన్.. చంద్రబాబు సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అంటూ విమర్శలకు దిగారు.. చంద్రబాబు స్కాంలు చేస్తా ఉంటాడు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటా ఉంటాడు, రాజ్యాంగంలో రాజధాని అనేది పదం అసలు ఉందా ?అని ప్రశ్నించిన జగన్.. కనీసం భూములు ఇచ్చిన రైతులకు అయినా హామీ నెరవేర్చాడా.. ఈ పెద్ద మనిషి అంటూ మండిపడ్డారు.
2019 కి ముందు 50 వేల ఎకరాలకు సంబంధించి బాహుబలి సెట్టింగ్స్ చూపించి మాస్టర్ ప్లాన్ చేశాడు చంద్రబాబు అని విమర్శలకు దిగారు. ఈరోజు మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని ఎందుకు అంటా ఉన్నాడు? అని నిలదీశారు. అసెంబ్లీలో ఐదున్నర గంట జగన్ ను.. వైసీపీ నాయకులపై దుమ్మెత్తి పోయడానికే చంద్రబాబు వాడుకున్నాడు అని మండిపడ్డారు. అసెంబ్లీలో భాగమైన కౌన్సిల్ ను ఎందుకు పిలవడు అని ప్రశ్నించారు. కౌన్సిల్ ను పిలిస్తే తన బండారం బయట పడుతుందని చంద్రబాబు పిలవడు అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
2014 నుంచి ఇప్పటి వరకూ 12 ఏళ్ల కాలంలో.. మనస్పూర్తిగా నువ్వు ఇక్కడ ఉన్నావా.. ఇక్కడ కాపురం పెట్టావా అని సూటిగా చంద్రబాబును అడుగుతున్నా అంటూ మండిపడ్డారు. పరిపాలన అంటే చంద్రబాబు దృష్టిలో, విచ్చలవిడి అవినీతి, దోపిడీ మాత్రమే అని, అమరావతి(Amaravati)పై శాసనసభలో చేసిన తీర్మానం, రాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి, ప్రజలను పక్కదోవ పట్టించడానికే అని విమర్శించారు. రాజధాని పేరిట పట్టపగలు దోపిడీ అని, అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇది అని విమర్శించారు.
రాజధాని మీద తీర్మానం అవసరం లేదని ప్రభుత్వంలోని మంత్రి పార్థసారథే చెప్పారు అని, రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, సీట్స్ ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉంది అన్నారు. ఈ వాస్తవాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దు అని కోరారు జగన్. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అని, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్రమే అధికారికంగా హైకోర్టులో చెప్పిందని, 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ఆ రాష్ట్రాలకు రాజధానులు కేంద్రం నిర్ణయిస్తే వచ్చాయా? అని ప్రశ్నించారు. ఎవ్వరికీ వర్తించనవి మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తున్నాయి అని ప్రశ్నించారు. మరి 7 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి, లక్ష ఎకరాల అమరావతిలో ఇంతవరకూ కట్టింది ఎంత? అని ప్రశ్నించారు. నిజంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా? అంటూ నిలదీశారు.
ఇవి కూడా చదవండి








