Yamini Sharma: దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీ : యామినీ శర్మ
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా జగన్ (Jagan) కుట్రలు పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ (Yamini Sharma) ధ్వజమెత్తారు. జగన్ రాజకీయ ఉనికి కోసమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ (YCP) ప్రభుత్వంలో విచ్చలవిడిగా అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ దోచుకుని సర్వనాశనం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై సొంత స్టిక్కర్లు (Stickers) వేసుకుని క్రెడిట్ చోరీ చేశారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సూపర్ సిక్స్‌పై, కూటమి పాలనపై అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలి అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇవి కూడా చదవండి







