విద్యార్థులకు ఐఐటీ సాంకేతిక విద్య.. IITM ప్రవర్తక్‌తో టెక్సోరా ఒప్పందం
IITM Pravartak: టెక్సోరా ప్రైవేట్ లిమిటెడ్, ఐఐటీ మద్రాస్‌కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ‘IITM ప్రవర్తక్’తో ఒక కీలకమైన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. నాణ్యమైన సాంకేతిక విద్య అనేది భౌగోళిక ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు సంస్థ పేర్కొంది.
ఒప్పందం ముఖ్య ఉద్దేశం..
ముఖ్యంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు, తొలి తరం అభ్యాసకులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , సైబర్ సెక్యూరిటీ రంగాలలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. తమ ప్రయాణంలో తోడుగా ఉన్న విద్యార్థులు, భాగస్వాములు , శ్రేయోభిలాషుల మద్దతు వల్లే ఈ మైలురాయిని చేరుకోగలిగామని టెక్సోరా ఫౌండర్ అశోక్ బాబు కోల్లా తెలిపారు. ఈ గొప్ప మిషన్‌పై నమ్మకం ఉంచిన IITM ప్రవర్తక్ బృందానికి సంస్థ ధన్యవాదాలు తెలియజేసింది.








