RK Roja: ఆ గాడిదలు ఎక్కడ..? రోజా వివాదాస్పద కామెంట్స్..!
గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఆర్కే రోజా.. మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు మాట్లాడుతున్నా మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు ఆమె. ఇక ఇప్పుడు తాజాగా సిఎం చంద్రబాబు(Chandrababu Naidu) సహా పలువురిపై రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. ఉగాది పండుగ సంబురాల గురించి రోజా మీడియాతో మాట్లాడారు. ఉగాది రోజునా వైఎస్ జగన్(YS Jagan), వైఎస్ భారతీ గారు కుటుంబ సమేతంగా పండుగ జరుపుకున్నారని, సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), టీటీడీ(TTD) చైర్మన్ బీఆర్ నాయుడు ఏం చేసారని రోజా నిలదీశారు.
ఇవి కూడా చదవండి
ఈ గాడిదలు నిన్న ఎక్కడికి పోయాయి.. ఏమి చేస్తున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య కలసి ఎందుకు ఉగాది చేసుకోలేదు అని మండిపడ్డారు. ఉగాది రోజు చంద్రబాబు ఆయన భార్యతో కలసి ఎందుకు చేసుకోలేదు అని ప్రశ్నించారు. పండుగ రోజు లేకుండా చంద్రబాబు భార్య హెరిటేజ్ లో కూర్చుని పాలు పిసుకుతున్నారా..? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సిగ్గు లేని బిఆర్ నాయుడు రాజీనామా చేయకుండా పదవిలో ఉన్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
తిరుమలకు(Tirumala) ఒక మహిళతో, షిరిడీ మరో మహిళలతో పోతాడని, తిరుమలలో ఉగాది పండుగను ఎందుకు చేయలేదు,బిఆర్ నాయుడు ఎక్కడికి పోయాడు అని నిలదీశారు. నిన్న ఈ ముగ్గరు గాడిదలుగాస్తున్నారా ?? అని ప్రశ్నించారు. కుటుంబ సమేతంగా వచ్చి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పక పోవడానికి ఎంటి వీళ్ళకు రోగం అని ప్రశ్నించారు. జగన్, భారతి గారు సంతోషంగా పండుగను జరుపుకున్నారని, కూటమీ ప్రభుత్వం వచ్చిన మొదటి, రోజు నుండి ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి 1500 ఇస్తామని మహిళలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఆశ వర్కర్స్, రైతులు, మహిళలు ఏ ఒక్కరు సంతోషంగా లేరని, రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారన్నారు.
ఇవి కూడా చదవండి








