బ్రహ్మం చౌదరిని పరామర్శించిన నారా లోకేష్
తాడేపల్లి: కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి (Brahmam Chowdary)ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పరామర్శించారు. మణిపాల్ ఆసుపత్రికి వచ్చిన మంత్రి.. బ్రహ్మం చౌదరిని కలిశారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. బ్రహ్మం మాట్లాడుతూ ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపారు. మణిపాల్ వైద్యుల (Manipal doctors) తో లోకేష్ మాట్లాడగా బ్రహ్మం చౌదరి పూర్తిగా కోలుకున్నారని, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వారు తెలిపారు. బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమి శ్వేత (Gautami Swetha)తో మాట్లాడి ధైర్యం చెప్పారు.








