నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారాలపై మంత్రి లోకేష్ సమీక్ష
నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రీకులు క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్న లోకేష్.
నలుగురు సురక్షితంగా ఉన్నారని… మరో ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదని తెలిపిన ఏపీ ఢిల్లీ భవన్ అధికారులు.
కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మీలు ఆచూకీ లభించలేదని వెల్లడి.
మిస్సైన ముగ్గురి ఆచూకీని కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని లోకేష్ సూచన.
చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద చివరిసారిగా కనిపించిన ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్.
కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్నా… క్షేమంగానే ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు.
సురక్షితంగా ఉన్న వారిని వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశం.
యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరపాలని లోకేష్ సూచన.
నేపాల్ లో చిక్కుకున్న యాత్రీకులు, మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసులు సమాచారాన్ని తెలుసుకుంటున్న ఆర్టీజీఎస్ అధికారులు.
మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి నిరంతరం మానిటర్ చేస్తున్న ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్.








