రెండేళ్లల్లో రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశాం : మంత్రి కొల్లు
రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర (Ravindra) తెలిపారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాణిపాక వరసిద్ధి వినాయకస్వామి (Vinayaka Swamy) వారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని నాశనం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశాం. కుట్రలు తప్ప జగన్ (Jagan)కు అభివృద్ధి పట్టదు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రపన్నుతోంది. రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తాం అని తెలిపారు.








