ఏపీలో కొత్త లోక్ సభ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ?
డీలిమిటేషన్ (Delimitation) తో దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు 815కు పెరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. దేశం మొత్తానికి ఒకే పద్ధతిలో 50 శాతం చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. దీందో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లోక్ సభ (Lok Sabha) స్థానాల సంఖ్య 38కి చేరనుంది. ఈ నేపథ్యంలో కొత్త నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఏర్పాట వుతాయనే ఆసక్తి నెలకొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విభజన చేస్తే సగటున ఒక్కో లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 13.02 లక్షల జనాభా ఉంటారు. ప్రస్తుతం కొన్ని లోక్ సభ నియోకవర్గాల్లో జనాభా 20 లక్షలకు పైగా ఉంది. వీటి పరిధిలో కొత్తవి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రాజధాని అమరావతి (Amaravati) కేంద్రంగా కొత్త లోక్ సభ నియోజకవర్గం ఏర్పాటు చేస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి








