ఆయన రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికి నష్టం : చంద్రబాబు
జగన్ (Jagan) ఇంట్లో ఉంటే ఆయన ఇంటి వరకే నష్టం, కానీ ఆయన రాజకీయాల్లో ఉంటే రాష్ట్రానికి నష్టం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్‌ఛార్జులతో కాఫీ కబుర్లు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ (YCP) నాయకులు పొట్టేళ్లను నరికి రక్తాభిషేకాలు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరుకుతాం అని పోస్టర్లు పెడుతున్నారు. ఇది వాళ్ల సంస్కృతి అని ధ్వజమెత్తారు. వైసీపీ అరాచకాలు, దుర్మార్గాల్ని ప్రజలకు వివరించాలని సూచించారు. పనితీరు ప్రాతిపదికగా ఒక మండలాధ్యక్షురాలిని, క్లస్టర్ ఇన్‌ఛార్జిని పార్టీలో అత్యున్నతమైన పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నామని వివరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కార్యకర్తే అధినేత అన్న విధానానికి ఇదే నిదర్శనమన్నారు. పని చేసేవారికి గౌరవం, గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. ఎన్నికలకు ముందు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు, ఎన్నికల మ్యానిఫెస్టో (Manifesto)ను మీరు ఇంటింటీకి తీసుకెళ్లారు. అధికారంలోకి వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆ హామీలన్ని అమలు చేశాం. గతంలో కంటే రెట్టింపు సంక్షేమం అమలు చేస్తున్నాం. వీటికి కార్యకర్తలు ఓనర్షిప్ తీసుకోవాలి. ప్రభుత్వం ఏ పని చేసినా దాని ఫలితం పార్టీకే దక్కుతుంది అని అన్నారు.








