ఏపీలో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీపీ(MPP), జడ్పీ చైర్మన్ల (ZP Chairmen) పరోక్ష ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 19న ఎంపీపీ, 20న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఎస్ఈసీ(SEC) ఆదేశించింది. 659 మండల ప్రజాపరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌ల చైర్మన్, వైస్ చైర్మన్ (Vice Chairman) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ చేతులు ఎత్తే పద్ధతి ద్వారా చేపట్టనున్నారు.







