Pawan Kalyan: చంద్రబాబు వల్లే పెట్టుబడులు: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Ap Government) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న, ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్(arcelor steel plant )ఇండియా ప్లాంట్ కు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శంకుస్థాపన చేసారు. కేంద్ర మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్(Nara Lokesh), టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనితతో తదితరులతో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ నారాయణ మిట్టల్, ఏఎం – ఎన్ ఎస్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్ప్ స్టీల్ ఇండియా ప్రతినిధులు సహా తదితరులు హాజరు కాగా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఏపీలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ద్వారా లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం ఉత్తరాంధ్ర ప్రజలకు అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు పవన్ కళ్యాణ్.
ఇవి కూడా చదవండి
ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడి మాలో విశ్వాసాన్ని పెంచిందన్నారు పవన్. లక్ష్మీమిట్టల్‌ను ఒప్పించి పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే చెందుతుందని కొనియాడారు. రాజకీయ దురంధరుడు చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
అంతకు ముందు మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని 2019లో ఆదిత్య మిట్టల్‌ను కోరానన్నారు. 2024లో మేం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపారు. కేవలం జూమ్ కాల్ ద్వారానే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు కోరారని, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందన్నారు. ఉక్కు పరిశ్రమకు ఇవాళ శంకుస్థాపన మాత్రమే కాదు.. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం, నమ్మకానికి ఇదొక ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించుకున్నాం.. ఆ హామీని నెరవేర్చటంలో భాగంగా ఇవాల్టి శంకుస్థాపన మరో మైలురాయి అవుతుందన్నారు. ప్రపంచ స్టీల్ పటంలో అనకాపల్లికి కూడా స్థానం దక్కిందని హర్షం వ్యక్తం చేసారు.
ఇవి కూడా చదవండి








