Chandrababu: ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలి : చంద్రబాబు
గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పలువురు మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. గ్యాస్ (Gas) సరఫరా అంశంపై మంత్రులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ముఖ్యమంత్రికి వివరించారు. గ్యాస్ సరఫరా అంశంపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ భేటీ అవుతున్నట్లు సీఎంకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని సీఎం సూచించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని సమస్య లేకుండా ప్రయత్నం చేయాలని ఆదేశించారు.హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.








