ఇప్పుడు ఎన్నికలు జరిగినా ..కూటమిదే విజయం : చంద్రబాబు
ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూటమిదే విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అమరావతి (Amaravati)లో టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సర్వేలన్నీ కూటమికే అనుకూలంగా ఉన్నాయని టీడీపీ ( TDP) నేతల్లో జోష్ నింపారు. కూటమిలో ఐకమత్యం కీలకమని పేర్కొన్నారు. గిల్లికజ్జాల తో రచ్చకెక్కొద్దంటూ నేతలకు హితబోధ చేశారు. రాజకీయ నాయకులు వర్తమానాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. అనేక అవకాశాలు మనవద్ద ఉన్నాయని, వాటిని నాయకులు అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక తయారు చేస్తామని, అనేక రకాల పెట్టుబడులు విశాఖ రీజియన్ (Visakhapatnam region)కు తీసుకువస్తున్నామన్నారు. నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని, దీనిపై అందరూ దృష్టి పెట్టాలన్నారు.








