నన్ను రెచ్చగొడితే అవన్నీ బయటపెడతా : విజయసాయి రెడ్డి
దసరా(Dasara) మర్నాడు కొత్త పార్టీ (New party)ని ప్రకటిస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) తెలిపారు. విజయవాడలో ఆయన మీడియా మాట్లాడుతూ తన వెనక ఎంతమంది ఉన్నారనేది ఆర్నెల్ల నుంచి ఏడాదిలోపు అందరూ చూస్తారని చెప్పారు. టీడీపీ (TDP), వైసీపీ రెండూ కుటుంబ పార్టీలని, ఒకరు పోతే మరొకరు అధికారంలో ఉండాలని చూస్తున్నారని, అందువల్లే మూడో ప్రత్యామ్నాయంగా తాను పార్టీ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. అమరావతిని తాను వ్యతిరేకించట్లేదని చెప్పారు. రెడ్డి సామాజికవర్గం ఎలా ఆవిర్భవించింది? రెడ్డిరాజులు ఎలా పాలించారనే సమాచారంతో 350 పేజీల పుస్తకాన్ని రచించా. ఇది ఆసక్తికొద్దీ చేశా అని చెప్పారు. వైసీపీ ( YCP) కోటరీ మళ్లీ నన్ను నమ్మకద్రోహి అంటూ రెచ్చగొడితే నా దగ్గర చాలా నిజాలున్నాయి, అవన్నీ బయటపెడతా అని హెచ్చరించారు.








