కేసీఆర్ చేసిన తప్పుల వల్లే ప్రస్తుత సమస్యలు : మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పై కేసీఆర్ (KCR) ఇంకా మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. నేనే ఇంజనీర్ అంటూ కేసీఆర్ కాళేశ్వరం కట్టించి చివరకు కూల్చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేసినా సరిగా నిర్మించకపోవడం వల్లే ప్రస్తుత సమస్యలు వచ్చాయి. నీళ్ల సమస్యకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఎల్నినో, మరొకటి కేసీఆర్. నీటి పంపకాల విషయంలో కేసీఆర్ తెలంగాణ (Telangana)కు అన్యాయం చేశారు. ఇరిగేషన్ శాఖను నాశనం చేశారు. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ చేసిన తప్పుల వల్లే ప్రస్తుత సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయన మాట్లాడిన భాష వల్లే తెలంగాణ భాషకు చెడ్డ పేరు వచ్చింది అని ఆరోపించారు.








