దుద్దిళ్ల శ్రీపాదరావు హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు జ్ఞాపకార్థం శాసనసభ ఆవరణలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు (Sridhar Babu), ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), అజారుద్దీన్ (Azharuddin) తదితరులతో కలిసి సీఎం రిబ్బన్ కత్తిరించారు. సెంట్రల్ హాల్లో శ్రీపాదరావు చిత్రపటానికి సీఎంతోపాటు స్పీకర్, చైర్మన్ మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సెంట్రల్ హాల్లో సీఎం కలియ తిరిగి పరిశీలించారు. తర్వాత సీఎం మంత్రులు, సభ్యులతో కలిసి హాల్లో అల్పాహారం తిన్నారు. అంతుకుముందు వేద పండితుల సమక్షంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.








