తాతా మధుపై చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్ నేతలకు దళితులు అంటే చిన్న చూపు అని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. స్పీకర్ (Speaker)ను దారుణంగా అవమానించారన్నారు. స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుడైన స్పీకర్‌ను సర్ అనాల్ని వస్తుందనే కేసీఆర్( KCR) అసెంబ్లీ ( Assembly)కి రావడం లేదని విమర్శించారు. తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.








