ఈ బిల్లు పాస్ కావడం మహిళల దశాబ్దాల కల : పురందేశ్వరి
మహిళా రిజర్వేషన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని రాజమండ్రి లోక్సభ (Lok Sabha) ఎంపీ పురందేశ్వరి (Purandeswari) అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభ లో ఆమె మాట్లాడారు. గతంలో చాలాసార్లు బిల్లు పెట్టినా సాకారం కాలేదని, అప్పట్లో సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) మద్దతివ్వలేదని తెలిపారు. రాజకీయాల్లో మహిళల పాత్ర పెరిగిందని గ్రహించాలన్నారు. ఈ బిల్లు పాస్ కావడం మహిళల దశాబ్దాల కల. 2023లో మద్దతిచ్చిన కాంగ్రెస్ (Congress,), ఇప్పుడు మాత్రం కొర్రీలు పెడుతోంది. జనగణన పేరుతో అభ్యంతరాలు చెబుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు మొట్టమొదట 1996లో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లును రాజ్యసభ (Rajya Sabha)లో ప్రవేశపెట్టింది అని అన్నారు.
ఇవి కూడా చదవండి








