Purandeswari: బడ్జెట్ పై కనీసం అవగాహన లేనివారే విమర్శలు : పురందేశ్వరి
బడ్జెట్ పై కనీసం అవగాహన లేనివారే విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ పురందేశ్వరి (Purandeswari) ఆక్షేపించారు. ఢిల్లీలో బడ్జెట్ పై ఆమె మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ పై వైసీపీ (YCP) సహా విపక్షాల ఆరోపణలను ఖండించారు. బడ్జెట్ తో ఏపీకి కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతిపక్ష నేతలు బడ్జెట్ ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. పోలవరానికి (Polavaram) రూ.3,300 కోట్లకు పైగా నిధులను కేంద్రం కేటాయించిది. అమరావతి (Amaravati)లో మౌలిక వసతుల కోసం రూ.400 కోట్లు ఇవ్వనుంది. 15వ ఆర్థిక సంఘం రికమెండేషన్ను కొనసాగిస్తూ రూ.63వేల కోట్ల ప్రయోజనాలు రానున్నాయి. 6వ ఆర్థిక సంఘం గ్రాంట్ ప్రకారం రూ.1.04 లక్షల కోట్ల రికమెండేషన్ను స్వీకరిస్తున్నట్లు బడ్జెట్ లో ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం నిధులు వస్తాయి అని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






