Chandrababu: ఎన్నిక ఏదైనా కూటమే గెలవాలి : సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) చెప్పారు. వాటికి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన వారితో చర్చించారు. జగన్ (Jagan) ఐదేళ్ల ఏలుబడిలో రాష్ట్రంలో చేసిన విధ్వంసాన్ని వివరిస్తూనే, గత 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనం గెలిచామని, ఎన్నిక ఏదైనా కూటమిదే గెలుపు కావాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మంత్రులు (Ministers) క్షేత్రస్థాయి పర్యటనలను పెంచాలన్నారు. రైతులకు సాగునీటిని సకాలంలో అందించడంపై దృష్టి సారించాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడి (Nimmala Rama Naidu)ని ఆదేశించారు. మే 15వ తేదీకల్లా సాగునీటి విడుదల జరగాలని తేల్చిచెప్పారు. ఈలోగానే కాల్వలు, డ్రెయిన్లను శుభ్రం చేయించాలన్నారు. జగన్ జమానాలో నిర్లక్ష్యానికి గురైన ఎత్తిపోతల పథకాలను తిరిగి గాడిలో పెట్టాలని సూచించారు. ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు 7 లక్షల ఎకరాలకు నీరు అందలేదన్నారు. చివరి ఎకరాకూ నీరు చేరాలన్న లక్ష్యంతో పనిచేయాలని మంత్రులను కోరారు. ఏప్రిల్ నుంచి 90 రోజులు రాష్ట్రవ్యాప్తంగా జలధార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా దీనికి రూపకల్పన చేశామన్నారు. పంచాయతీల్లో పన్నుల వసూలు బాగా జరుగుతోందని, ఇదే తరహాలో నీటి తీరువా వసూలు దిశగా నీటి సంఘాలను సన్నద్ధం చేయాలని మంత్రి నిమ్మలకు సూచించారు.
ఇవి కూడా చదవండి








