అత్యుత్తమ జాతీయ పరీక్ష విధానం రూపొందించాలి : సీఎం చంద్రబాబు
* ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయంలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ నందన్ నిలేకని భేటి
* రాష్ట్ర సచివాలయానికి వచ్చిన నందన్ నిలేకనికి స్వాగతం పలికిన ఐటీశాఖ మంత్రి నారా లోకేష్
* దేశ పరీక్షల విధానాన్ని సమూలంగా మార్చటంలో భాగంగా నందన్ నిలేకని నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం
* పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న టాస్క్‌ఫోర్స్ బృందం
* ఆయా రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలను అధ్యయనం చేస్తున్న ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్
* ఏపీలో అనుసరిస్తున్న అకడమిక్, కాంపిటేటివ్ పరీక్షల నిర్వహణ విధానాలను ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న నిలేకని
* పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట, పరీక్షల నిర్వహణకు టెక్నాలజీ వినియోగం, సైబర్ సెక్యూరిటీని, డిజిటల్ ఫోరెన్సిక్స్ విభాగాలను బలోపేతం చేయడం టాస్క్ ఫోర్స్ దృష్టి
* దేశవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్ష విధానాన్ని రూపొందించేలా అధ్యయనం
* దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమ న్యాయం జరిగేలా ఒక సమగ్రమైన జాతీయ పరీక్షా విధానాన్ని ఖరారు చేయడం కోసం సంప్రదింపులు
* డీఎస్సీ నిర్వహణలో అనుసరించిన నూతన విధానాలను, టెక్నాలజీ వినియోగాన్ని టాస్క్ ఫోర్స్‌కు వివరించిన మంత్రి లోకేష్.
* ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా మొత్తం విద్యా విధానంలో సంస్కరణలు తేవాలని సూచించిన సీఎం చంద్రబాబు







