దాదా వాయిదా వార్తల్లో నిజం లేదు!
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని(Gopichand malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా దాదా(Dada). ఈ సినిమా రిలీజ్‌పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా సినిమా రిలీజ్ వాయిదా పడిందని, వచ్చే ఏడాది సంక్రాంతి లేదా మహాశివరాత్రి కానుకగా రిలీజయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం మొదలైంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అనౌన్స్ చేసిన డేట్ తేదీ ప్రకారమే సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
బాలకృష్ణ తిరిగి షూటింగ్లో పాల్గొన్న తర్వాత మిగిలిన కార్యక్రమాలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసేలా షెడ్యూల్స్ రూపొందించారు. అనుకున్న ప్లాన్ ప్రకారమే షూటింగ్ ను పూర్తి చేసిన యూనిట్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పై దృష్టి సారించింది. ఇప్పటికే కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తమన్(Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే వర్క్స్ లో బిజీగా ఉండగా, మరోవైపు డబ్బింగ్ వర్క్స్ కూడా కొనసాగుతున్నాయి. దీంతో డిసెంబర్ 24 రిలీజ్ టార్గెట్ గా సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా, పెద్ది(Peddi) నిర్మాత వెంకట సతీష్ కిలారు(venkata satish kilaru) నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. త్వరలోనే థియేట్రికల్ బిజినెస్‌ను కూడా ముగించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ పై వస్తున్న పోస్ట్ పోన్ ప్రచారానికి తెరదించుతూ, ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కే సినిమాను తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.







