రామాయణ టీమ్‌కు అల్లు అర్జున్ స్పెషల్ మెసేజ్!
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ స్థాయిలో చాటిచెప్పే ప్రయత్నాలకు సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) భారీ ప్రాజెక్ట్ రామాయణ(ramayana) చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. రణ్‌బీర్ కపూర్(Ranabir kapoor), యష్(Yash), సాయిపల్లవి(Sai pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ స్పందిస్తూ.. రామాయణం కేవలం సినిమా మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, చరిత్ర, గొప్పతనాన్ని ప్రతిబింబించే ప్రయత్నమని పేర్కొన్నారు. ఇలాంటి కథలను ప్రోత్సహించేందుకు అందరూ ఒక్కటై నిలవాలని పిలుపునిచ్చారు.
భారతీయ సినిమాల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ సినిమాను అభివర్ణించిన అల్లు అర్జున్ మెసేజ్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. ఒక పాన్ ఇండియా స్టార్ మరో భారీ సినిమాకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇండస్ట్రీలోని ఐక్యతను చాటుతోంది.
నమిత్ మల్హోత్రా(Namith malhotra), యష్(yash), డీఎన్ఈజీ(DNEG) సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. నితీష్ తివారీ(nitesh tiwari) దర్శకత్వం వహిస్తుండగా, హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్(Hans zimmer), ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను దిల్ రాజు(Dil raju)కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri venkateswara creations) రిలీజ్ చేస్తోంది. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.







