గాడ్ ఆఫ్ వార్ స్క్రిప్ట్‌పై త్రివిక్రమ్ స్పెషల్ ఫోకస్
టాలీవుడ్లో మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)కు ఇటీవల కాలం అంతగా కలిసిరావడం లేదు. గుంటూరు కారం(Guntur Karam) తర్వాత వెంకటేష్ (Venkatesh)తో ఆయన తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం(Aadarsa kutumbam) కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశాజనక ఫలితాన్ని అందుకుంటోంది. ముఖ్యంగా కథ, కథనం విషయంలో త్రివిక్రమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షూటింగ్ ఆలస్యం, స్క్రిప్ట్‌లో మార్పులు, సెట్స్ నిర్మాణం వంటి కారణాలతో భారీగా ఖర్చు పెరిగిందనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(haarika and Haasinee creations)కు ఈ సినిమా నష్టాలను మిగిల్చే ప్రాజెక్ట్‌గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. ఎన్టీఆర్(NTR) హీరోగా ఆయన తెరకెక్కించనున్న గాడ్ ఆఫ్ వార్(God Of War) త్రివిక్రమ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందనుంది. అంతేకాకుండా తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ముందుకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇలాంటి ప్రిస్టీజియస్ సినిమాకు కథ, కథనాలే ప్రధాన బలంగా నిలవాల్సి ఉంటుంది. అందుకే షూటింగ్ ప్రారంభించే ముందే స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు డిజిటల్ రైట్స్ బిజినెస్ గతంతో పోలిస్తే మందగించడం, భారీ సినిమాల నిర్మాణ వ్యయాలపై నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తుండటం కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గాడ్ ఆఫ్ వార్ బడ్జెట్ విషయంలోనూ నిర్మాణ సంస్థ కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశముంది. ఎన్టీఆర్ కూడా కథ విషయంలో మరింత టైమ్ కేటాయించాలని కోరుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదర్శ కుటుంబం రిజల్ట్ త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ముఖ్యంగా భారీ అంచనాలు, స్టార్ కాస్ట్ ఉన్న గాడ్ ఆఫ్ వార్ విషయంలో త్రివిక్రమ్ తీసుకునే జాగ్రత్తలే కీలకం కానున్నాయి.







