రాష్ట్ర ప్రగతిలో యాదవుల భాగస్వామ్యం అవసరం : సీఎం రేవంత్ రెడ్డి
సదర్ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….
యాదవ సోదరులందరికీ సదర్ సమ్మేళన శుభాకాంక్షలు.
ఇది యాదవులకే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి ఆత్మగౌరవ సమ్మేళనం
హైదరాబాద్ నగరంలో ఇప్పటి గోల్కొండ కోట ఒకనాటి గొల్లంకొండ
యాదవ సోదరుల సహకారంతోనే హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందింది
దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారిని యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకున్నారు.
గతంలో ఏ ముఖ్యమంత్రి సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలన్న ఆలోచన చేయలేదు
యాదవులు కొరగానే మేం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాం..
సదర్ సమ్మేళనం నిర్వహణకు రూ.5 కోట్లు మంజూరు చేశాం
తెలంగాణలో మేం కులగణన చేసి చూపించాం
తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా కులగణన నిర్వహించాం

మా ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం కల్పించాం
అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్ కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాం
ఈశ్వరమ్మ యాదవ్ ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించాం
యాదగిరి గుట్ట గోశాలలో గోసంరక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం
రాబోయే యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటాం
యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు లేకుండా చూసే బాధ్యత మాది
దేశంలో తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనినేదే మా ప్రయత్నం
మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది
ఇందుకు యాదవ సోదరుల సహకారం ఉండాలని కోరుతున్నా







