ప్రభాస్‌తో ఒక్క సినిమా.. UV క్రియేషన్స్‌కు కీలకం!
టాలీవుడ్లో ప్రభాస్(prabhas)కు, యూవీ క్రియేషన్స్(UV Creations)కు మధ్య ఉన్న బాండింగ్ ప్రత్యేకమైనది. ప్రభాస్ సన్నిహితులు వంశీ(vamsi), ప్రమోద్(pramod) స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ మిర్చి(Mirchi) సినిమాతో జర్నీని ప్రారంభించింది. కొరటాల శివను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సినిమా మంచి సక్సెస్‌ను అందుకుంది. ఆ తర్వాత ప్రభాస్‌తోనే సాహో(Saaho), రాధేశ్యామ్(Radheshyam) సినిమాలను నిర్మించింది. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో యూవీ క్రియేషన్స్ ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిన ప్రభాస్ ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీ కావడంతో సంస్థకు ఆయనతో మరో సినిమా చేయడం కీలకంగా మారింది.
ఇటీవలి కాలంలో యూవీ క్రియేషన్స్ భారీ స్థాయి స్టార్ హీరోల సినిమాలను నిర్మించే విషయంలో కొంత వెనుకబడింది. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో రూపొందిస్తున్న విశ్వంభర(Viswambhara) కూడా రెండేళ్లకు పైగా ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే ప్రభాస్‌తో ఒక భారీ సక్సెస్ఫుల్ సినిమాను నిర్మించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ కూడా తన సొంత నిర్మాణ సంస్థతో సినిమా చేసేందుకు సుముఖంగానే ఉన్నప్పటికీ, సరైన డైరెక్టర్ ఎంపిక విషయంలోనే ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని తెలుస్తోంది.
మరోవైపు ప్రభాస్ ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers), వైజయంతీ మూవీస్(vyjayanthi movies), హోంబలే ఫిల్మ్స్(Hombale films) వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలకు సినిమాలు చేయడానికి అంగీకరించారు. ప్రస్తుతం ఆయన పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు కూడా ఉండటంతో 2028 వరకు కొత్త సినిమా కోసం డేట్స్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో యూవీ క్రియేషన్స్ సరైన కథతో పాటు క్రేజీ కాంబినేషన్‌ను రెడీ చేసుకోవాల్సి ఉంది. ప్రభాస్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి బ్లాక్‌బస్టర్ అందుకుంటేనే సంస్థ ఆర్థికంగా కోలుకోవడంతో పాటు తిరిగి బలమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది.







