సితార చేతికి ధనుష్ సినిమా తెలుగు హక్కులు
కోలీవుడ్ స్టార్ ధనుష్(dhanush), మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(mammootty) కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఓం: ఛాప్టర్1- రుధిరం(Om chapter1 rudhiram) ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments) రెడీ అయింది. నవంబర్ 20, 2026న ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు సంస్థ అనౌన్స్ చేసింది. భారీ తారాగణం, విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు మార్కెట్లోనూ మంచి అంచనాలను సొంతం చేసుకుంటోంది.
ఈ సినిమాలో ధనుష్, మమ్ముట్టితో పాటు సాయి పల్లవి(sai pallavi), శ్రీలీల(Sree Leela), నాజర్(nassar), నసీరుద్దీన్ షా(Nasirudhin shah), ఇంద్రన్స్(Indrans), చైతూ జొన్నలగడ్డ(Chaitu jonnalagadda) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అమరన్(Amaran) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ పెరియసామి(Rajkumar periyasaami) ఈ సినిమాకు కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్స్ కలగలిపిన కథనంతో ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందించాలనే ప్రయత్నంలో చిత్రబృందం ఉంది. సాయి అభ్యంకర్(Sai Abhyankar) మ్యూజిక్ ఈ ప్రాజెక్ట్‌కు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.
ధనుష్(Dhanush), శ్రద్ధ అగర్వాల్(shraddha agarwal), అజ్మత్ జగ్మాగ్(Ajmath jagmag) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే జైలర్2(jailer2), లోకా: చాప్టర్1(Lokah; chapter1) వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సితార ఎంటర్టైన్మెంట్స్, ఇప్పుడు ఈ భారీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ధనుష్, మమ్ముట్టి కలయిక వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.







